క్రైమ్/లీగల్

ఎయిర్‌పోర్టులో రెండు కిలోల బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శంషాబాద్, మార్చి 17: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల బంగారాన్ని ఆదివారం తెల్లవారుఝామున ఇమిగ్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన వ్యక్తి కారు ఇంజన్ విడి భాగాల్లో పెట్టుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి బంగారంతో పాటు అతని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.