క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం, మార్చి 17: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాగర్ రహదారిపై సంఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం వెళ్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న హోటల్ వద్ద ముగ్గురు యువకులు మాట్లాడుకుంటుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ముగ్గురూ దగ్గరి బంధువులు కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన గణపతి(20), వంశీ (19) ల్యాబ్ టెక్నీషియన్‌లుగా పనిచేస్తుండగా సాయి కుమార్(20) బీఎస్సీ చదువుతున్నాడు. శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ముగ్గురు యువకులు తమ ద్విచక్ర వాహనంపై తుర్కయంజాల్ గ్రామంలో దగ్గరి బంధువుల ఫంక్షన్‌కు వెళ్తూ మార్గమధ్యలోని గుర్రంగూడ చౌరస్తాలోని రన్‌వే ఫుడ్‌కోర్ట్ వద్ద రోడ్డు ప్రక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో బీఎన్‌రెడ్డినగర్ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వేగంగా వెళ్తున్న మహీంద్రా జైలో అతి వేగంగా వస్తూ నిలబడి ఉన్న ముగ్గురు యువకులను ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.