క్రైమ్/లీగల్

కర్వెన రిజర్వాయర్ క్వారీలో పడి ఇద్దరు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మార్చి 17: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్‌కు తవ్వుతున్న క్వారీలోని ఊట బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెన ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం బాదేపల్లి పట్టణంలోని పాతబజార్‌కు చెందిన ఎండి ఖలీల్ (23), అదే కాలనీకి చెందిన మహేష్ (30)లు కర్వెన రిజర్వాయర్ పరిధిలో జరుగుతున్న పనులను చూసేందుకు వచ్చారు. అయితే, పనుల్లో భాగంగా క్వారీ ఉండడం అందులో ఊటబావిలా నీరు ఉబికివచ్చి నీరు నిలువ ఉంది. అయితే, ఈ నీటిలో దిగిన ఈ ఇద్దరు ప్రమాదవశాత్తు మునిగిపోయారు. క్వారీలోని ఊటబావి లోతు ఎక్కువగా ఉండడం గమనించక వారు ఒకరి తర్వాత ఒకరు లోతులోకి జారిపోయారు. వారిద్దరికీ ఈత రాకపోవడంతో నీటమునిగి మృత్యువాత పడ్డారు. అయితే అటువైపు కొందరు వెళ్తుండగా ఈ విషయాన్ని గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించారు. వెంటనే భూత్పూర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై పర్వతాలు అక్కడికి చేరుకుని నీటమునిగిన ఖలీల్, మహేష్‌లను బయటికి తీశారు. మృతుల వద్ద లభ్యమైన ఆధారాల ప్రకారం వారు బాదేపల్లి పట్టణంలోని పాతబజార్‌కు చెందిన వారుగా గుర్తించి, పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు కర్వెన క్వారీ ఊటబావి దగ్గరకు వచ్చి పరిశీలించగా తమవారేనని భావించి బోరున విలపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పర్వతాలు తెలిపారు.