క్రైమ్/లీగల్

అప్పుల బాధకు కౌలు రైతు బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, మార్చి 17: తనకున్న పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలా నికి పెట్టుబడి పెట్టి వచ్చిన పంటను విక్రయించినా అప్పులు వెంటాడంతో కౌ లు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన పసుపులేటి కనకారావు (44) తనకున్న 3 ఎకరాలతో పాటు, మరో తొమ్మి ది ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు. పెట్టిన పంటలకు పెట్టుబడులు కూడా రాకపోవడం, రూ.15 లక్షల అప్పు కావడంతో ఆదివారం తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి అక్కడే పడిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించి ఓ ప్రైవేట్ ఆస్పతికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. కనకారావుకి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీఆర్వో వెంకటేశ్వర్లు పంచనామా చేసి నివేదికను ప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు.
చిత్రం.. కనకరావు మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు