క్రైమ్/లీగల్

వైఎస్ కుటుంబీకులను విచారించిన సిట్ అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 17: మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య సంఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ అధికారి మహంతి ఆధ్వర్యంలో పలు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం వైఎస్ కుటుంబ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యుడు వైఎస్.అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్.్భస్కర్‌రెడ్డి, వైఎస్.మనోహర్‌రెడ్డి, వైఎస్.ప్రతాప్‌రెడ్డి, వివేకానందరెడ్డి బావమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డిని పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ సభ్యుడు శ్రీనివాసులు విచారించారు. విచారణ అనంతరం వైఎస్.్భస్కర్‌రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ సంఘటన జరిగినరోజు ముందుగా తాము సంఘటనా స్థలానికి వెళ్లినందున అక్కడ ఏం జరిగిందన్న విషయంపై అధికారులు ప్రశ్నించారన్నారు. ఎవరిపైనైనా అనుమానాలు ఉన్నాయా అని అడిగారని, తమకు ఎవరిపై ఎటువంటి అనుమానాలు లేవని చెప్పినట్లు భాస్కర్‌రెడ్డి తెలిపారు. నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ తాను ఆరోజు హైదరాబాద్‌లో ఉన్నానని, కాబట్టి తనకేమీ తెలియదని, ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పామన్నారు. అలాగే వైఎస్.ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో తమ ఇద్దరి మధ్య గొడవలు జరిగాయనే ఉద్దేశ్యంతో ఏదైనా జరిగిందా అన్న కోణంలో విచారించారని, అయితే ఇందులో తమకెలాంటి సంబంధం లేదని చెప్పానన్నారు. వీరు నలుగురి నుంచి పోలీసులు లిఖితపూర్వకంగా వివరాలు సేకరించారు.