క్రైమ్/లీగల్

యాసిడ్ దాడి దోషులపై జాలి చూపాల్సిన అవసరం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: యాసిడ్ దాడి అనేది అనాగరిక చర్య, క్రూరమైన నేరమని, అలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తులపై ఎలాంటి జాలి, దయాగుణం చూపాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. యాసిడ్ దాడి కేసులో శిక్షను అనుభవించి గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఇద్దరు దోషులు ఒక్కొక్కరూ బాధితురాలికి 1.5 లక్షల రూపాయల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని జస్టిస్‌లు ఏఎం కన్వీల్కర్, అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు చెప్పింది. ఒక యువతిపై యాసిడ్ దాడికి పాల్పడిన ఇలాంటి వారిపై ఎలాంటి క్షమాగుణం చూపాల్సిన అవసరం లేదని, బాధితురాలి బాధతో పోలిస్తే ఇదేం పెద్ద ఎక్కువ కాదని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఒక యువతి (19) 2004, జూలై 12న నడుచుకుంటూ కాలేజీకి వెళ్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెపై యాసిడ్ పోసి పరారయ్యారు. 16 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేయగా, కేసును విచారించిన ట్రయల్ కోర్టు ఒక్కొక్కరికీ పది సంవత్సరాల జైలు శిక్ష, ఐదు వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఆ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించగా వారి శిక్షా కాలాన్ని ఐదేళ్లకు తగ్గించి జరిమానా మొత్తాన్ని మాత్రం 25 వేల రూపాయలు చేసింది. ఈ తీర్పుపై బాధితులు సుప్రీంకు వెళ్లగా కేసు విచారించిన ధర్మాసనం నిందితులు ఇద్దరూ గత ఏడాది డిసెంబర్ తొమ్మిదినే విడుదలైనప్పటికీ వారు బాధితురాలికి ఒక్కొక్కరూ 1.5 లక్షల చొప్పున అదనపు పరిహారం చెల్లించాలని సోమవారం తీర్పు చెప్పింది. యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అలాగే బాధితురాలికి పరిహారం చెల్లించే పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సైతం వెంటనే ఆమెకు ఆ మొత్తాన్ని వెంటనే మూడు నెలల్లో ట్రయల్ కోర్టులో జమ చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.