క్రైమ్/లీగల్

న్యూడెమోక్రసీ దళ కమాండర్ విక్రమ్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, మార్చి 18: సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ రాయల వర్గం మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు గూడూరు డివిజన్ కార్యదర్శి అజాత దళ కమాండర్ పెనుక వెంకన్న, అలియాస్ విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి తపంచా, 10 తూటాలు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. గూడూరు పొలీస్‌స్టేషన్‌లో సోమవారం సాయం త్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో విక్రమ్ అరెస్టుకు సంబందించిన వివరాలను వెల్లడించారు. గూడూరు మండలం జగన్నాయకుల గూడెంకు చెందిన పెనుక వెంకన్న 5 తరగతి చదువుతున్న సమయంలో విప్లవ పార్టీ అయిన ప్రజా పంధాకు ఆకర్షితులయ్యాడని చెప్పారు, 1990లో అజ్ఞాతంలోకి వెళ్ళి దళ సభ్యుడిగా పనిచేశాడని ఆతర్వాత 1991లో బయటకు వచ్చి లీగల్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాడని తెలిపారు. 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలో అప్పరాజుపల్లి ఎంపీటీసీగా న్యుడెమోక్రసీ నుండి పోటీ చేసి గెలిచాడని చెప్పారు. ఆ తర్వాత 2005లో పీపీజీ నక్సలైట్లతో ఏర్పడ్డ విభేధాలతో మళ్ళీ వెంకన్న న్యూడెమోక్రసీ గోపన్న దళంలో చేరినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత పోలీసులకు ఓ మా రు పట్టుబడి జైలుకు వెళ్ళి వచ్చాడన్నారు. న్యూడెమోక్రసీ దందాలో ఏర్పడ్డ వి బేధాలతో పార్టీలో పెద్ద చంద్రన్న రాయల వర్గంగా విడిపోయారు. ఈ క్రమం లో పెనుక వెంకన్న రాయల వర్గంలో చేరి దళ నాయకుడిగా బాధ్యతలు చేపట్టి పలువురు కాంట్రాక్టర్లు, వ్యాపారుల వద్ద చందాలు వనూలు చేశాడని అన్నారు, రెండు ప ర్యాయాలు పట్టుబడి జైలుకు వెళ్లాడని బెయిల్‌పై విడుదలై మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వివరించారు. సోమవారం గూడూరు ఏజెన్సిలోని పోట్లంపాడు శివారులో చం దాల కోసం వెళ్తుండగా విక్రమ్‌ను గూడూరు సీఐ బాలా జీ, గూడూరు కొత్తగూడ ఎస్సైలు యాసీన్ తాహేర్‌లు చాకచక్యంగా పట్టుకున్నారని తెలిపారు. అరెస్టు చేసీన విక్రమ్‌ను కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు. విక్రమ్‌ను పట్టుకున్న సీఐ, ఎస్సైలను ఎస్పీ అభినందించారు. త్వరలోనే వీరికి రివార్డులు అందజేయనున్నుట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఏఎస్పీ గిరిధర్, డీఎస్పీ నరేష్‌కూమార్, సీఐ బాలాజీ ఎస్సైలు యాసీన్ తాహేర్ పోలీసులు పాల్గొన్నారు.
పోలీసులకు పట్టుబడ్డ విక్రమ్ (ఫైల్)