క్రైమ్/లీగల్

చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 18: తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మంగళం క్వార్టర్స్‌లో ఉన్న ఆమెను సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎస్పీ అన్బురాజన్ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళ స్థానిక ప్రైవేట్ హోటల్‌లో పని చేస్తున్న తులసిగా గుర్తించామన్నారు. దీనిపై వెంటనే స్పందించి పలు బృందాలను సమీప రాష్ట్రాలకు కూడా పంపించామన్నారు. ఆమె ఫోన్‌ను ట్రాక్ చేయడంతో తిరుపతి సమీపంలోని మంగళం క్వార్టర్స్‌లోనే ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు.