క్రైమ్/లీగల్

రెండు బైకులు ఢీ: విద్యార్థినికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మార్చి 19: రెండు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థిని గాయాలకు గురైంది. మంగళవారం ఉదయం కొందుర్గు గ్రామ సమీపంలోని తుంపల్లి రహదారి మలుపు వద్ద రెండు బైకులు ఢీకొని విద్యార్థినికి గాయాలయ్యాయి. జిల్లేడ్ చౌదరిగూడకి చెందిన వౌనిక, స్రవంతి 10వ తరగతి పరీక్ష రాసేందుకు కొందుర్గులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ ఢీకొనడంతో తండ్రి మల్లేష్, వౌనిక, స్రవంతికి గాయాలయ్యాయి. అక్కడే స్పృహ కోల్పొయిన వౌనికను కొందుర్గు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలి వైద్యసేవలు అందించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పదవ తరగతి పరీక్షలకు వెళ్లారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.