క్రైమ్/లీగల్

4 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్వేటినగరం, మార్చి 19: చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద రూ. 4 కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నియమావళి నేపథ్యంలో కొల్లాగుంట చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా బొలెరో వాహనంలో రూ. 4కోట్లు విలువచేసే బంగారు ఆభరణాలు ఉన్నాయని, వీటిలో 12 కిలోల బంగారు ఆభరణాలు, 60 వజ్రాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. చెన్నై నుంచి మలబార్ బంగారు దుకాణం ఆభరణాలకు సంబంధించిన నగలుగా గుర్తించామన్నారు. ఈ నగలు చెన్నై నుంచి తిరుపతిలో 13 దుకాణాలకు, నెల్లూరులో 10 దుకాణాలకు సరఫరా చేయడానికి తీసుకువెళుతున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వీటి విలువ సుమారు రూ. 4 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. బంగారు ఆభరణాలను సీజ్‌చేసి చిత్తూరు కలెక్టర్ కార్యాలయానికి తరలించినట్లు ఆయన వెల్లడించారు. ఇదిలావుండగా మదనపల్లె నుంచి పలమనేరు వైపు కారులో ప్రయాణిస్తున్న నలుగురి వద్ద రూ.2.15 లక్షల నగదు ఈవోఆర్డీ, ఎస్సై అరుణ్‌కుమార్‌రెడ్డి పట్టుకున్నారు.