క్రైమ్/లీగల్

రూ.10 కోట్ల మద్యం స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: ఎన్నికల వేళ ఇప్పటి వరకు దాదాపు పది కోట్ల రూపాయల విలువైన అక్రమ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రెండు లక్షల యాభైవేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోగా, ఐడీ లిక్కర్ 33వేల లీటర్లు, ఎస్‌డీపీఎల్ రెండు వేల రెండు వందల లీటర్లు, ఐఎంఎస్‌ఎల్ విభాగంలో రెండు లక్షల లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. 2014 ఎన్నికల సమయంలో మొత్తం రూ. 9.53 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకోగా ప్రస్తుతం పోలింగ్‌కు మరో 25 రోజుల సమయం ఉండగానే, కేవలం 18 రోజుల వ్యవధిలోనే రూ.10 కోట్ల బెంచ్‌మార్క్‌ను దాటటం విశేషం. ఈ నేపథ్యంలో మంగళవారం సచివాలయంలో తనను కలిసిన పాత్రికేయులతో ఎక్సయిజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ఫలితంగానే ఇంత పెద్ద ఎత్తున మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోగలుగుతున్నామన్నారు. ఎటువంటి వత్తిడులు లేకుండా ఎన్నికల కమీషన్ ఆదేశానుసారం సిబ్బంది 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్నారని పోలింగ్ ముగిసే వరకు ఇదే వేగాన్ని ప్రదర్శించాలని ఆదేశించామన్నారు.