క్రైమ్/లీగల్

టైర్ల పరిశ్రమలో పేలిన సిలిండర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, మార్చి 20: టైర్ల పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామ పంచాయతీ పరిధిలోని దొంతికుంటతండా సమీపంలో ఉన్న టైర్ల పరిశ్రమలో గ్యాస్ సిలిండర్ పేలి దుద్దేల ప్రవీణ్‌తోపాటు మరో కార్మికులు తీవ్రంగా గాయపడ్డాడు. టైర్ల పరిశ్రమలో పనిచేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతోపాటు శరీరంపై తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రథమ చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. ఇరువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లువైద్యులు పేర్కొంటున్నారు. షాద్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.