క్రైమ్/లీగల్

మద్యం అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 20: మద్యం అక్రమ నిల్వలపై టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ గోడౌన్ నుంచి సుమారు రూ.77,67,610 లక్షలు విలువైన 67 రకాల కంపెనీలకు చెందిన మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సాధారణ ఎన్నికల దృష్ట్యా మద్యం అక్రమ నిల్వలపై దృష్టి సారించిన నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ బృందాలు సమాచారం మేరకు మాచవరం పోలీస్టేషన్ పరిధిలోని మొగల్రాజపురం టిక్కిల్‌రోడ్డు, బొంబే జ్యూయలరీ షాపు సమీపంలోని బే లేవ్స్ కిచెన్ రెస్టారెంట్‌పై దాడులు నిర్వహించారు. హేంగోవర్ పేరుతో వైన్‌షాపు నిర్వహిస్తున్న ఉప్పలపాటి సత్యనారాయణ అనే వ్యక్తి కొద్దిరోజులుగా గదిని అద్దెకు తీసుకుని 67రకాల కంపెనీలకు చెందిన మద్యం సీసాలు పెద్ద ఎత్తున నిల్వ ఉంచినట్లు దాడుల్లో వెల్లడైంది. ఇందుకు సంబంధించి ఏ విధమైన బిల్లులు లేకపోవడంతో సరుకు స్వాధీనం చేసుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు నిందితునితో సహా మాచవరం పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.