క్రైమ్/లీగల్

శ్లాబ్ కూలి ఆరుగురు కూలీలకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: నూతనంగా నిర్మిస్తున్న విల్లాస్ ఆర్చీ శ్లాబ్ కూలి ఆరుగురు గాయపడ్డారు. బుధవారం గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలిసింది. విల్లాస్ ఆర్చీ ఒక్కసారిగా కూలింది. శిధిలాల కింద కూలీలకు స్థానికులు బయటకు తీసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోల్కొండ ఇన్‌స్పెక్టర్ కొమరయ్య కథనం ప్రకారం.. తారమ తి భారదారి ఎదురుగా నూతనంగా వెస్సేల్లా గ్రూప్ విల్లాస్‌లో కొంత కాలంగా పనులు జరుగుతున్నాయి. రోజూ మాదిరిగానే బిహార్ రాష్ట్రానికి చెందిన కూలీలు బుధవారం ఉదయం పనిలోకి వెళ్లారు. కొంత మంది కూలీ లు విల్లాస్ ముందు ఆర్చీ రెండో అంత స్తు నిర్మాణం జరుగుతుంది. ఈ క్ర మంలో ఆర్చీ కూలి ఆరుగురి కూలీలపై పడింది. బాధితులను లంగర్‌హౌస్ కు చెందిన ఓ ఆసుపత్రిలో నర్సప్పా (34), బాల్‌రాజ్ (26), రాజు (18), నానల్‌నగర్‌లో ఉన్న మరో ఆసుపత్రిలో విరేష్ (30), నూర్‌సాలం చికిత్స పొందుతుండగా, ఇద్దరి పరిస్థితి విషయంగా ఉందని డాక్టర్లు తెలిపారు.