క్రైమ్/లీగల్

ప్రాణం తీసిన సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 21: హోలీ వేడుకల్లో అపశృతి దొర్లింది. ఉదయమంతా స్నేహితులతో రంగుల్లో ఆడి పాడిన బాలుడు స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ మునిగి మరణించాడు. విషాద సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం గుజరాత్ దామేరాకు చెందిన భాయి కుమారుడు భగవాన్ భాయి(16) విద్యార్థి. హైదరాబాద్ పాతబస్తీ బేగంబజార్‌లో ఉంటున్న బంధువు చంపాలాల్ ఇంటికి ఈనెల 19న వచ్చాడు. గురువారం హోలీ సంబురాల్లో భాగంగా సురేష్, ఎమ్మార్, స్నేహితులతో కలిసి నగర శివారు కాచవానిసింగారంలోని బాబూరావు క్రికెట్ అకాడమీకి వచ్చారు. హోలీ సంబురాలతో పాటు సరదాగా క్రికెట్ ఆడుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో స్నేహితులతో కలిసి ఈతకు ఉపక్రమించారు. నీటిలో ఎందరో ఉన్నప్పటికీ ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించాడు. ఇతని మరణం అనుమానాస్పదంగా ఉందని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు.