క్రైమ్/లీగల్

హెచ్‌సీయూలో జింక అనుమానాస్పద మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, మార్చి 21: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనుమానాస్పద స్థితిలో జింక మృతిచెందింది. ఉదయం యూనివర్సిటీలోని షూటింగ్ రేంజ్ సమీపంలో జింక మృతి చెంది శరీరంపై గాయాలుండడం గమనించిన విద్యార్థులు.. గచ్చిబౌలి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల క్రితం జింకను కుక్కలు చంపినట్లు యూనివర్సిటీ విద్యార్థులు తెలిపారు. వేసవి రాక ముందే యూనివర్సిటీలో ముగజీవుల మృత్యు ఘోష పెరడంతో వన్యప్రాణ సంరక్షలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంఘటన ప్రదేశానికి ఫారెస్టు అధికారులు చేరుకొని జింకకు పంచనామా చేసి పోస్టుమార్టానికి తరలించారు. వేసవి కావడంతో నీటి కోసం వచ్చిన ముగజీవులను కుక్కలు వేటాడి చంపుతున్నట్లు ఆటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు వెంట పడడంతో జింకలు ఇక్కడ ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌లో చిక్కుకుంటున్నాయని తెలిపారు. ఫెన్సింగ్‌కు చిక్కుకున్న ముగజీవులను కుక్కలు చంపుతున్నాయని విద్యార్థులు తెలిపారు. జింకపైన ఉన్న గాయాలు కూడా ఫెన్సింగ్‌లో చిక్కడం వలన గీసుకున్నవిగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హాస్టళ్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను బయట వేయడంతో వాటిని తినడానికి కుక్కలు వచ్చి ముగజీవులను వేటాడి చంపుతున్నాయని తెలిపారు. యూనివర్సిటీకి ఫెన్సింగ్ లేకపోవడంతో కుక్కలు విపరీతంగా వస్తున్నాయని పేర్కొన్నారు. ముగజీవుల రక్షణకు యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటవీ శాఖ అధికారులు కోరారు.