క్రైమ్/లీగల్

కోడ్ ఉల్లం‘ఘనుల‘పై పోలీసు కొరడా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మార్చి 21: ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిబంధనల అతిక్రమణకు పాల్పడేవారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని నగర పోలీసుశాఖ స్పష్టం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలోనూ.. అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియలోనూ ఎన్నికల కోడ్‌కు లోబడి వ్యవహరించాల్సిన అభ్యర్థులు గీత దాటితే వారిపై చట్టపరచర్యలకు నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకాతిరుమలరావు ఏమాత్రం వెనుకాడటం లేదు. కమిషనరేట్ పరిధిలో ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్న క్రమంలో మద్యం అక్రమ నిల్వలు, అనధికారిక నగదు తరలింపు, పెద్ద ఎత్తున ఓటర్లను ప్రలోభపరిచేందుకు ముందుగానే భారీగా ఉంచిన చీరలు, ఇతర సామగ్రి వంటివి ఇప్పటికే నగర పోలీసులు నిఘా వేసి పట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా నేరుగా నిబంధనలు ఉల్లంఘించిన పలు రాజకీయ పార్టీల అభ్యర్థులపైన కేసులు నమోదు చేయడం కీలక పరిణామం. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రధాన అభ్యర్థులపై ఇప్పటికే నామినేషన్ దాఖలు సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కింద కృష్ణలంక పోలీసులు కేసులు నమోదు చేశారు. తూర్పు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహనరావు నామినేషన్ వేసేందుకు వెళ్లే సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి టపాసులు కాల్చినందుకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా వైఎస్సార్ పార్టీ తరుఫున తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి బొప్పన భవ కుమార్ ఎన్నికల నామినేషన్ దాఖలు సమయంలో టపాసులు కాల్చినందుకు కూడా కృష్ణలంక పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మల్లాది విష్ణు నామినేషన్ దాఖలు సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించి పరిమితికి మించి కార్యకర్తలను తీసుకుని వెళ్లినందుకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా తూర్పు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థి బత్తిన రామ్మోహనరావు నామినేషన్ వేసేందుకు వెళ్లే సమయంలో నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి వాహనాలకు పార్టీ జెండాలను కట్టినందుకు కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.