క్రైమ్/లీగల్

భార్యపై కాల్పులు జరిపి, ఐఏఎస్ అధికారి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 22: మహారాష్టల్రో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విజయ్‌కుమార్ భగవత్ పవార్ (57) అనే ఐఏఎస్ అధికారి ఎయిర్ గన్‌తో భార్యపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోలాపూర్ జిల్లాలోని మంగల్‌వేధా పట్టణంలో శుక్రవారం తెల్లవారు జామున ఈ విషాదం జరిగింది. పవార్ ప్రస్తుతం స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలో పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. అంతకు ముందు నందూర్‌బార్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. మార్వాడే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆయన ఇంట్లోంచి తుపాకీ కాల్పుల శబ్దం విన్న ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దంపతులిద్దర్నీ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఐఏఎస్ అధికారి భగవత్ పవార్ చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన భార్య సోనాలీ పవార్ బుల్లెట్ గాయాలతో చికిత్స పొందుతోంది. ‘ఎయిర్ గన్‌తో సోనాలీపై కాల్పులు జరిపారు. సంఘటనా స్థలం నుంచి రెండు రౌండ్ల ఖాళీ కార్ట్‌రిడ్జ్ స్వాధీనం చేసుకున్నాం’ అని పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.