క్రైమ్/లీగల్

గుప్త నిధుల తవ్వకాల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, మార్చి 22: యాదాద్రి భువనగిరి జిల్లా సైదాపురం గ్రామ శివారు ప్రాంతంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.శుక్రవారం యాదగిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేవంలో మాట్లాడుతూ గురువారం రాత్రి సైదాపురం శివారు ప్రాంతంలోని సర్వే నెంబర్ 32లో గుర్తు తెలియని వ్యక్తులు గుప్తు నిధుల కోసం తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నించిరని కొంత మంది గ్రామస్తులు అది గమనించి పోలీసులకు సమాచారం అందించగానే సీఐ నర్సింహరావుతో పాటు ఎస్సై మధుబాబు హుటా హుటిన సంఘటన స్థలికి చేరుకుకోగా ఇది గమనించిన గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపేందుకు వచ్చిన వారు పారిపోయారని తెలిపారు. శుక్రవారం ఉదయం సైదాపురం గ్రామానికి చెందిన వీఆర్‌ఓ ఇచ్చి పిర్వాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపులు చేయగా గౌరాయిపల్లి గ్రామ శివారు ప్రాంతంలో ఆగి వున్న వాహనాన్ని అనుమానం వచ్చి సోదాలు చేయగా వారి వాహనంలో జామ కర్రలు దొరికాయని అవి దేనికి ఉపయోగిస్తారని అడుగగా వారి సమాధానాలతో అనుమానం వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వివిధ జిల్లాల నుండి నాగర్‌కర్నూలు, మహబూబూనగర్, వనపర్తి, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నుల్ జిల్లాకు చెందిన మరొకరు వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఇక్కడ గుప్త నిధులతో పాటు రైస్ పుల్లింగ్ రాగి పలుకలు తవ్వేందుకు వచ్చినట్లు తెలిపారని అన్నారు.గతంలో కూడా రెండు సార్లు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని విచారణలో తేలిందని తెలిపారు. చిన్నయ్య అనే వ్యక్తి గతంలో మల్లాపురం సైదాపురంలో పలు ప్రాంతాలలో పనిచేశాడని కొద్ది రోజుల క్రితం ఒక మర్రి చెట్టు క్రింద పడుకోగా తన చేతికి ఒక శక్తి తాకినట్లు అనిపించిందని అనుమానం వచ్చి పలువురిని కలుపుకుని ఈ తవ్వకాలకు పూనుకున్నామని అన్నారు. సైదాపురం గ్రామంలోని 32 సర్వే నెంబర్‌లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేస్తుండగా గ్రామస్తులు రావడంతో అక్కడి నుండి పారి పోవడం జరిగిందని అన్నారు.వీరి నుండి మారుతి రితిజ్ కారు టీ ఎస్ 08 యుబి 9197,2 బైక్‌లు,7 సెల్ ఫోన్స్,2 గోవా స్టిక్స్ దొరికినట్లు తెలిపారు.నిందితులను పట్టుకున్న సీఐ నర్సిగరావు,ఎసై మధుబాబు,రమేష్‌ను అభినందించారు.