క్రైమ్/లీగల్

ఎల్‌ఆర్‌లకు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 24: సుమారు 8,100 కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన కేసు పురోగతి కోసం లెటర్స్ రొగాటరీ (ఎల్‌ఆర్)లను రాసేందుకు అనుమతించాల్సిందిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) చేసిన వినతిపై ఢిల్లీ కోర్టు సానుకూలంగా స్పందించింది. గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్ వేల కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన సంఘటనపై ఈడీ విచారణ జరుపుతున్నది. అందులో భాగంగానే, యునైటెడ్ కింగ్‌డమ్, యూఏఈసహా మొత్తం 21 దేశాలకు, కేసులో సాయం చేయాల్సిందిగా ఎల్‌ఆర్‌లను రాసేందుకు అనుమతించాల్సిందిగా కోర్టును కోరింది. దీనిపై అడిషినల్ సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా శనివారం తీర్పునిచ్చారు. అమెరికా, చైనా, పనామా, ఆస్ట్రియా తదితర దేశాల్లోనూ ఈ కేసుకు సంబంధించిన విచారణ జరగాల్సి ఉందని ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కంపెనీకి చెందిన డైరెక్టర్లు నితిన్ సందేసర, చెతన్ కుమార్ సందేసర ఇప్పటికే అల్బేనియా పౌర సత్వాన్ని స్వీకరించినట్టు కోర్టుకు వెళ్లడించింది.