క్రైమ్/లీగల్

ఇంటి దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, మార్చి 22: పని చేసే సంస్థకే కన్నం వేసిన వ్యక్తిని అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు కధనం ప్రకారం మల్కాజిగిరి వినాయకనగర్‌లో నివసించే ముత్యాల ప్రవీణ్ కుమార్ మల్కాజిగిరిలోని మ్యాక్స్ బట్టల షోరూంలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. ఈనెల 17న సంస్థకు సంబంధించిన నలభై వేల రూపాయలను సంస్థ ప్రతినిధులకు తెలియకుండా దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. మేనేజర్ ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు.

నిర్లక్ష్యమే నిండు ప్రాణం తీసిందా?
ఉప్పల్, మార్చి 22: ప్రమాదం జరుగుతుందని తెలిసి.. జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ బాలుడి నిండు ప్రాణం పోవడానికి కారణమయ్యారనే అభియోగంపై స్విమ్మింగ్ పూల్ నిర్వహకుడిని మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ వారసిగూడ నామాలగుండు ప్రాంతంలో నివసిస్తున్న ఏలేటి నవీన్ కుమార్(45) కోచ్. నగర శివారులోని కాచవానిసింగారంలోని బాబారావు క్రికెట్ అకాడమీ పక్కనే రెండేళ్ల క్రితం స్విమ్మింగ్ పూల్ నిర్మించాడు. స్థానిక గ్రామ పంచాయతీలో దరఖాస్తు పెట్టి రూ.28వేలు చలాన్ మాత్రమే చెల్లించి అనుమతి తీసుకోకుండానే స్విమ్మింగ్ పూల్‌ను నడిపిస్తున్నాడు. ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పటికీ శిక్షణ పొందిన ఇద్దరు కోచ్‌లు ఉండాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. హోలీ సందర్భంగా సెలవు ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం ఎంజాయ్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ వద్ద ఏర్పాట్లు చేశారు. స్టేషన్‌లో అనుమతి తీసుకోకున్నా మైక్‌ను ఏర్పాటు చేసి రెయిన్ డ్యాన్స్‌తో క్రికెట్ ఆడేందుకు వచ్చిన పిల్లలు స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నప్పటికీ అక్కడ నిర్వాహకులు, కోచ్‌లు లేరు. ఇదే సమయంలో అక్కడికి స్నేహితులతో వచ్చిన రాజస్థాన్‌కు చెందిన భగవాన్ భాయి(16) బాలుడు ఈత రాకున్నా నీటిలోకి దిగి మునిగి మరణించిన విషయం తెలిసిందే. జాగ్రత్తలు తీసుకోకుండా కోచ్‌లను ఏర్పాటు చేయకుండా బాలుడి మృతికి కారణమయ్యాడనే అభియోగంపై నిర్వహకుడు నవీన్ కుమార్‌పై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్-2 కింద కేసు నమోదు చేసి కోర్టుకు రిమాండ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ బీ.అంజిరెడ్డి తెలిపారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని
విద్యార్థిని

దుర్మరణం

ఉప్పల్, మార్చి 22: ఆర్టీసీ బస్సు ఢీకొని ఇంజనీరింగ్ విద్యార్థిని దుర్మరణం చెందిన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం బోడుప్పల్ అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న యాదగిరిగుట్టకు చెందిన సత్యం కూతురు స్నేహ(20) కీసర మండలం బోగారంలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న నేపథ్యంలో అమీర్‌పేట మైత్రీవనానికి స్నేహితురాలు శృతితో కలిసి హోండా ఆక్టివాపై వెళ్తుండగా ఉప్పల్ గాంధీ విగ్రహం వద్ద ప్రమాదవశాత్తు వెనుక నుంచి వేగంగా వచ్చిన చెంగిచర్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. కింద పడిపోయిన స్సేహ తలపై బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. హోండా నడుపుతున్న శృతి ప్రాణాలతో బతికి బయటపడింది. అదే సమయంలో వెనుక వస్తున్న స్నేహితుల ఏడుస్తున్న తీరు పలువురి హృదయాలు కదిలించాయి. డ్రైవర్ నిర్లక్ష్య డ్రైవింగ్‌తో సంఘటన జరిగిందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.