క్రైమ్/లీగల్

ఢిల్లీ పాలనపై అధికారం ఎవరిదో తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: ఢిల్లీలో పాలనాపరమైన విభాగాల్లో ఎదురవుతున్న సమస్యలను నియంత్రించేందుకు, త్వరితగతిన పరిష్కరించేందుకు వీలుగా ఒక ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ‘ఆప్’ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈమేరకు సుప్రీంలో ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది. ఢిల్లీలో పాలన, సర్వీసులపై పూర్తిస్థాయి అధికారాలు ఎవరివో తేల్చాలని, ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేందుకు విస్తృత అధికారాలు గల బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం సుప్రీం కోర్టును అభ్యర్థించింది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షతన గల సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఢిల్లీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తామని స్పష్టం చేసింది.
ఢిల్లీలో పాలనాపరమైన అంశాల్లో ఎదురవుతున్న అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని అపెక్స్ కోర్టు ఫిబ్రవరి 14న స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ ఉన్నతాధికారుల పోస్టింగులు, బదిలీలు తదితర అంశాల్లో కేంద్రం తీసుకునే నిర్ణయమే కీలకమని ఇద్దరు జడ్జిలతో కూడిన బెంచ్ స్పష్టం చేస్తూ మరోపక్క దీనిపై తలెత్తే వివాదాలను పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఒక బెంచ్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని పేర్కొంది. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు దేశ రాజధానిలోని ప్రభుత్వం మధ్య గత దీర్ఘకాలికంగా కొనసాగుతున్న ఆరు అంశాల్లో ఐదింటిపై స్పష్టమైన తీర్పునిచ్చిన విషయాన్ని డివిజన్ బెంచ్ పేర్కొంది. అయితే, ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అక్కడ పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి కేసులపై విచారణ జరపడానికి ఆస్కారం లేదని తెలిపింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య గత కొంతకాలంగా నలుగుతున్న ఆరు అంశాల్లో ఢిల్లీ ప్రభుత్వం మూడు అంశాల్లో విజయం సాధించింది. కేవలం ఢిల్లీలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ప్రత్యేక కమిషన్ ద్వారా విచారణ లేదా దర్యాప్తు జరపాలన్న అంశంపై ఢిల్లీ సర్కారు జోక్యం చేసుకోలేదు. ఇదే విషయాన్ని ఇపుడు ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తావిస్తూ దేశ రాజధానిలోని పరిపాలనా విభాగంలోని అన్ని సర్వీసుల్లో తలెత్తుతున్న సమస్యలు, విభేదాల పరిష్కారానికి ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఇదిలావుండగా, ప్రజల చేత ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వం భూ వివాదాలు, రెవెన్యూ, తదితర అంశాల్లో జరిగే ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకునే హక్కు ఉందని అపెక్స్ కోర్టు గతంలో స్పష్టం చేసింది. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కమిషన్ లేదా బోర్డు విషయంలో కూడా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించుకోవచ్చునని ఢిల్లీ ప్రభుత్వానికి సూచించింది. సెక్రటరీలు, వివిధ శాఖల అధిపతులు, ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో సెక్రటరీల పోస్టింగులు, బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ సలహాతో చేపట్టవచ్చునని జస్టిస్ ఏకే సికీ స్పష్టం చేశారు.