క్రైమ్/లీగల్

రూ.2 లక్షల నిధులు గోల్‌మాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మార్చి 25: మహిళా సమాఖ్యలో రెండు లక్షల రూపాయల నిధులు గోల్‌మాల్ అయిన సంఘటన జిల్లేడు చౌదరిగూడ మండల పరిధిలోని రావిర్యాల, వీరసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది. స్ర్తి నిధి బ్యాంక్‌లో తీసుకున్న రుణాలను చెల్లించే విషయంలో గ్రామ మహిళా సంఘాల సభ్యులు ప్రతినెల డబ్బులు బుక్‌కీపర్‌కు, సీసీలకు చెల్లించినప్పటికి ఆ డబ్బులు స్ర్తి నిధి బ్యాంక్ ఖాతాలో జమచేయలేదని మహిళా సంఘాల సభ్యులు వివరించారు. 2016 మార్చి 18వ తేదిన స్ర్తినిధి బ్యాంక్‌లో 14గ్రామ సంఘాల సభ్యులు ఒక్కొరు రూ.25వేల నుంచి 50వేల వరకు రుణాలు తీసుకున్నారు. స్ర్తినిధి బ్యాంక్‌లో తీసుకున్న రుణాలకు గాను తిరిగి చెల్లించే విషయంలో మహిళా సంఘాల సభ్యులు ప్రతినెల బుక్‌కీపర్‌కు, సీసీలకు డబ్బులు చెల్లించినప్పటికీ వాటిని స్ర్తినిధి రుణ ఖాతాలో జమచేయకుండా సొంతగా ఖర్చులు పెట్టుకున్నారని మహిళా సంఘాల సభ్యులు వివరించారు. ప్రస్తుతం రావిర్యాల, వీరసముద్రం గ్రామాలకు స్ర్తినిధి బ్యాంక్ నుంచి రూ.30లక్షల రుణాలు మంజూరు అయ్యాయి. రుణాలు పొందేందుకు గ్రామ మహిళాసంఘాల సభ్యులు జిల్లేడు చౌదరిగూడ మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రికార్డులు పరిశీలించగా అసలు విషయం బయటపడింది. దాదాపు రెండు లక్షల నిధులు దుర్వినియోగం అయ్యాయని, బుక్‌కీపర్, సీసీలు కాజేసినట్లు తెలిసిందని వివరించారు. బ్యాంక్ అధికారులు నకిలీ సంతకాలతో రుణాలు ఎలా మంజూరు చేశారనే విషయంపై మహిళా సంఘాల సభ్యులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సంతకాలు లేకుండా బ్యాంక్ రుణాలు ఎలా మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంక్ అధికారులు, బుక్‌కీపర్, సీసీలు కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.