క్రైమ్/లీగల్

ప్రజాధనం దుర్వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పథకంలో ఇంజినీరింగ్ స్ట్ఫా కాలేజీ అంచానాలను బీహెచ్‌ఈఎల్, మెగా, నవయుగ సంస్థలు భారీగా పెంచాయని, దీనిద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషన్ సోమవారం జస్టిస్ ఎస్‌ఏ బాబ్డె, జస్టిస్ సంజీవ్‌ఖన్నాలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి, బీహెచ్‌ఈఎల్, నవయుగ, మెగా సంస్థలకు నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ ఈ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని సాక్ష్యాధారాలతో చూపినా హైకోర్టు తొసిపుచ్చిందని అన్నారు. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ పాలమూరు రంగారెడ్డి ప్రాజక్టుపై హైకోర్టులో నాలుగు పిటిషన్లు దాఖలైతే రెండు పిటిషన్లును హైకోర్టు కొట్టివేసిందని వివరించారు. తెలంగాణలో దక్కన్ పీఠభూమి ప్రాంతంలో నదుల కన్నా ఎత్తులో భూములు ఉంటాయని, వందలాది అడుగుల నుంచి నీటిని తోడేందుకు మోటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందని, దానికి వ్యయం ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుని తెలంగాణ ప్రభుత్వం వాదనలు సరైనవే కావచ్చు.. కాని అంచనాల పెంపులో చాలా తేడాలు ఉన్నాయని అభిప్రాయపడింది. దీంతో ఈ పిటిషన్ విచారణకు స్వీకరిస్తున్నామని, ప్రభుత్వ వాదనలు కూడా వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. బీహెచ్‌ఈల్ సంస్థకు ప్రభుత్వం పనులు అప్పగించి ఉంటే ఎంత వ్యయం అయ్యేదని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి ఆ సంస్థ తరపు న్యాయవాది సమాధానం ఇస్తూ ప్రస్తుతం తన వద్ద సమాచారం లేదని ధర్మాసనానికి వివరించారు. పిటిషనర్ లేవనేత్తిన అంశాలపై సమాధానం ఇస్తూ 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి, మెగా, నవయుగ నిర్మాణ సంస్థలతోపాటు బీహెచ్‌ఈఎల్ సంస్థకు కూడా నోటీసులు జారీ చేసింది.