క్రైమ్/లీగల్

వాహనం బోల్తా: ఇద్దరు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దమండ్యం, మార్చి 25: 10వ తరగతి పరీక్షలు రాయడానికి వెళ్ళిన విద్యార్థులు వాహన రూపంలో వచ్చి మృత్యువాత పడిన సంఘటన సోమవారం చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, మరో ఆరుగురు విద్యార్థులు తీవ్ర గాయాలు కాగా మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థులు, పోలీసుల కథనం మేరకు ఇలా వున్నాయి. కలిచెర్ల జిల్లా పరిషత్ విద్యార్థులు 17మంది టెన్త్ పరీక్షలు రాయడానికి పరీక్ష కేంద్రానికి వెళ్ళడానికి కలిచెర్ల బస్టాండ్‌లో వేచి ఉన్నారు. అయితే ఓ పార్టీకి చెందిన ఎన్నికల ప్రచార వాహనం ప్రచారం కోసం పెద్దమండ్యంకు వస్తుండగా విద్యార్థులు సమయం మించిపోతోందన్న ఆతృతతో ఆ వాహనాన్ని ఆశ్రయించారు.
విద్యార్థులను ఆ వాహనంలో ఎక్కించుకుని పెద్దమండ్యం పరీక్ష కేంద్రానికి వస్తుండగా పరీక్ష కేంద్రానికి సమీపంలో డ్రైవర్ నిర్లక్ష్యంతోఅదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కన కాలువలో పడింది. ఈ ఘటనలో శెట్టివారిపల్లెకు చెందిన శ్రీనివాసులు(15) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఎనిమిది మంది గాయపడ్డారు. వీరిలో కలిచెర్లకు రాంమోహన్(15) అసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. నాగేశ్వరి, లోకేష్, జగదీష్, అంజాద్, మహేశ్వరి, లోకేష్, హేమలత, డ్రైవర్ శంకరను అసుపత్రికి తరలించారు. వీరిలో లోకేష్ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి అసుపత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థుల్లో నరేంద్ర, పవన్, నాగేంద్ర, శివప్రసాద్ స్వల్పగాయాలతోనే వెళ్ళి 10వ తరగతి గణిత పరీక్ష పేపర్-1 పరీక్ష రాశారు. డ్రైవర్ శంకర, నాగేశ్వరికి బలమైన గాయాలయ్యాయి. ఇద్దరు విద్యార్థులు మృతి చెందడంతో కలిచెర్ల, శెట్టివారిపల్లెలో శోకసంద్రంగా మారింది.
సంఘటన స్థలంలో మృతి చెందిన శ్రీనివాసులు మృతదేహాన్ని శవ పంచనామా కోసం మదనపల్లె ఫ్రభుత్వ అసుపత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ములకలచెరువు సిఐ శ్రీనివాసులు, పెద్దమండ్యం ఎస్‌ఐ సురేష్‌కుమార్ పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.