క్రైమ్/లీగల్

బాణసంచా గోడౌన్‌లో ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సబ్బవరం, మార్చి 25: విశాఖ జిల్లా సబ్బవరం మండలం మండలంలోని గుల్లేపల్లి సమీపంలోని శ్రీ భూలోకమాంబ ఫైర్ వర్క్స్‌లో సోమవారం సంభవించిన పేలుడులో ఇద్దరు మృత్యువాత పడగా మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అనకాపల్లి డీఎస్పీ ఎస్వీవీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం భూలోకమాంబ ఫైర్ వర్క్స్ పేరిట ఎలాంటి అనుమతి లేకుండా దాసరి సత్యనారాయణ అనే వ్యిక్తి బాణసంచా తయారు చేస్తున్నాడు. 2012 మే నెల 22న ఇదే కేంద్రంలో సంభవించిన పేలుడులో ముగ్గురు చనిపోవడంతో నిషేధం విధించిన అధికారులు ఆ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయలేదన్నారు. అయినప్పటికీ అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా సోమవారం ఒక్కసారిగా పేలుడు సంభవించి పనిలో ఉన్న దాసరి సత్యనారాయణ కుటుంబానికి చెందిన తండ్రి దాసరి సత్యం (58) దాసరి గంగమ్మ( 49), దాసరి రావలమ్మ( 30), దాసరి కోటమ్మ( 22), దాసరి అంకుల్ (చిన్న), దాసరి కనకరాజు(30), కూలీ పనికి వచ్చిన గుల్లేపల్లికి చెందిన ఎస్సీ కులానికి చెందిన సింగంపల్లి దుర్గారావు(55)లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో క్షత గాత్రులను 108 అంబులెన్స్‌లో స్థానిక సీఐ ఎం.శ్రీనివాసరావు మెరుగైన చికిత్సకోసం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సింగంపల్లి దుర్గారావు(55), దాసరి కోటమ్మ (22) మృతి చెందారన్నారు. తీవ్రంగా గాయపడిన వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉందన్నారు. సమాచారం తెలుసుకున్న సబ్బవరం ఫైర్ సిబ్బంది సహాయ ఫైర్ ఆఫీసర్ ఎం.సోమునాయుడు ఆధ్వర్యంలో మంటలను ఆర్పివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు.
చిత్రం.. మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది