క్రైమ్/లీగల్

సరైన ఆధారాలు లేక ఎవరికీ శిక్ష పడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచ్‌కుల (హర్యానా): పిరికిపందలు పాల్పడిన హింసాత్మక చర్యలో విశ్వసనీయమయిన, అంగీకార యోగ్యమయిన ఆధారాలు లేనందు వల్ల ఎవరికీ శిక్ష పడకుండా పోయిందని సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో తీర్పు ఇచ్చిన పంచ్‌కులలోని ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించింది. సంఝౌతా ఎక్స్‌ప్రెస్ పేలుడు కేసులో స్వామి అసీమానంద సహా మొత్తం నలుగురు నిందితులను ఈ కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం నలుగురు నిందితులు- నాబా కుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసీమానంద, లోకేశ్ శర్మ, కమల్ చౌహాన్, రాజీందర్ చౌదరిలను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు మార్చి 20వ తేదీన తీర్పు ఇచ్చింది. ‘పిరికిపందలు పాల్పడిన హింసాత్మక చర్యలో విశ్వసనీయమయిన, స్వీకార యోగ్యమయిన ఆధారాలు లేకపోవడం వల్ల ఎవరికీ శిక్ష పడకుండా పోయినందున ఎంతో బాధతో, తీవ్రమయిన వేదనతో ఈ తీర్పును ముగించాల్సి వస్తోంది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఉగ్రవాద చర్యకు పరిష్కారం దొరకకుండా పోయింది’ అని ఎన్‌ఐఏ కోర్టు న్యాయమూర్తి జగ్‌దీప్ సింగ్ తన తీర్పులో పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ మధ్య నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ 2007 ఫిబ్రవరి 18న పాకిస్తాన్ నుంచి వస్తూ హర్యానాలోని పానిపట్ సమీపంలోకి చేరుకున్న తరువాత అందులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 68 మంది మృతి చెందారు. ప్రపంచంలో ఏ మతం కూడా ఉగ్రవాదానికి పాల్పడుమని బోధించదని, అందువల్ల ఉగ్రవాదానికి మతం లేదని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.