క్రైమ్/లీగల్

ఉగ్రవాదానికి నిధులు సరఫరా ముగ్గురికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థలకు నిర్వాహకులుగా వ్యవహరిస్తున్న ముగ్గురికి 15 లక్షల జరిమానా విధించడమే కాక, ఉగ్రవాదులకు సమకూర్చేందుకు తీసుకువెళ్తున్న ఏడు లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం తెలిపారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్టు (ఫెమా) కింద మహమ్మద్ ఆయూబ్ మీర్, బెచ్ రాజ్ బెన్‌గాని, హెర్బాన్స్ సింగ్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలపై వారికి వరుసగా ఐదు, ఏడు, మూడు లక్షల రూపాయలను జరిమానాగా విధించినట్టు ఈడీ అధికారి ఒకరు తెలిపారు. ఫెమా కింద ఇలాంటి వారిపై చర్యలు తీసుకునే అధికారం ఈడీకి ఉందని చెప్పారు. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలు నిమిత్తం హవాలా రూపంలో వచ్చిన ఏడు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు.