క్రైమ్/లీగల్

అభ్యర్థుల నేర చరిత్రపై అమలుకాని తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ముందుగానే తమ నేర చరిత్రను ఎన్నికల సంఘానికి తెలియజేయాలని అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ధిక్కరించినందుకు గాను కోర్టు ధిక్కారం కింద విచారణ ప్రారంభించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం 2018 సెప్టెంబర్ 25వ తేదీన ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలియజేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు ఆర్‌ఎఫ్ నారిమన్, వినీత్ శరణ్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముగ్గురు డిప్యూటి ఎలక్షన్ కమిషనర్లు, న్యాయ శాఖ కార్యదర్శి, క్యాబినెట్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అశ్విని కుమార్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది.
ఎన్నికల్లో పోటీ చేయగోరే అభ్యర్థులంతా పోటీ చేయడానికి ముందే తమ నేర చరిత్రను ఎలక్షన్ కమిషన్ (ఈసీ)కు తెలియజేయాలని అయిదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2018 సెప్టెంబర్ 25వ తేదీన ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది. అలాగే అభ్యర్థుల నేర చరిత్రను ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని కూడా తన తీర్పులో పేర్కొంది. దీంతో ఎన్నికల సంఘం గత సంవత్సరం అక్టోబర్ పదో తేదీన సవరించిన ఫామ్-26కు సంబంధించి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అభ్యర్థుల నేర చరిత్రను ముందే ప్రకటించాలని రాజకీయ పార్టీలను, అభ్యర్థులను ఈ నోటిఫికేషన్‌లో ఆదేశించింది. అయితే, ఈసీ ఎలక్షన్ సింబల్ ఆర్డర్- 1968ని కాని ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని కాని సవరించలేదని, అందువల్ల ఆ నోటిఫికేషన్‌కు చట్టబద్ధత లేదని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాగే భారత ఎన్నికల సంఘం అభ్యర్థుల నేర చరిత్రను ప్రకటించడానికి వార్తా పత్రికలు, చానళ్ల జాబితాను ఇవ్వలేదని, దీంతో అభ్యర్థులు తమ నేర చరిత్రను అంతగా ప్రాచుర్యం లేని పత్రికలు, చానళ్లలో ప్రకటిస్తున్నారని తెలిపారు. చానళ్లలో అయితే ప్రజలు చూడని సమయాలలో ప్రసారం చేస్తున్నారని పేర్కొన్నారు.