క్రైమ్/లీగల్

సిట్‌కు మరో రెండు నెలల సమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 186 కేసుల దర్యాప్తును పూర్తి చేయడానికి స్పెషల్ ఇనె్వస్టిగేషన్ టీమ్ (సిట్)కు మరో రెండు నెలల సమయం ఇస్తూ సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. న్యాయమూర్తులు ఎస్‌ఏ బోబ్డే, ఎస్.అబ్దుల్ నజీర్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసుల దర్యాప్తులో 50 శాతానికి పైగా పని పూర్తయిందని, మొత్తం దర్యాప్తును పూర్తి చేయడానికి మరో రెండు నెలల సమయం ఇవ్వాలని సిట్ ధర్మాసనాన్ని కోరింది. సిట్ అభ్యర్థన మేరకు ధర్మాసనం మరో రెండు నెలల సమయం ఇచ్చింది. అల్లర్లలో పాల్గొన్నట్టు భావిస్తున్న 62 మంది పోలీసుల పాత్రపై విచారించాలని కోరుతూ ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటి సభ్యుడు ఎస్.గుర్లాద్ సింగ్ కహ్లోన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంబంధిత పక్షాలకు నోటీసులు కూడా జారీ చేసింది. సుప్రీంకోర్టు నిరుడు జనవరి 11వ తేదీన ఢిల్లీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఎన్ ధింగ్రా నేతృత్వంలో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రాజ్‌దీప్ సింగ్, సర్వీసులో ఉన్న ఐపీఎస్ అధికారి అభిషేక్ దులార్ సభ్యులుగా సిట్‌ను ఏర్పాటు చేసింది. గతంలోనే మూసివేసిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన 186 కేసుల తదుపరి దర్యాప్తును పర్యవేక్షించే బాధ్యతను అత్యున్నత న్యాయస్థానం సిట్‌కు అప్పగించింది. అయితే, వ్యక్తిగత కారణాల రీత్యా సిట్‌లో సభ్యుడిగా కొనసాగేందుకు సింగ్ నిరాకరించారు. దీంతో ప్రస్తుతం సిట్‌లో ఇద్దరే సభ్యులు ఉన్నారు.