క్రైమ్/లీగల్

ఎందుకు సహకరించరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: శారదా చిట్‌ఫండ్ కేసు దర్యాప్తులో ఎందుకు సహకరించడం లేదో తగిన వివరణ ఇవ్వాలని టెలికాం కంపెనీలైన వోడాఫోన్, ఎయిర్‌టెల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. శారదా చిట్స్ కుంభకోణానికి సంబంధించి తాము అడిగిన కాల్స్ వివరాలు, ఇతర డేటాను ఇవ్వడానికి ఈ రెండు సర్వీస్ ప్రొవైడర్లు నిరాకరిస్తున్నాయని సుప్రీంకు సీబీఐ వివరించింది. అయితే తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని ఈ రెండు కంపెనీలు కోర్టుకు తెలియజేయడంతో దీనిపై తగిన వివరణ ఇవ్వాలని పేర్కొంటూ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో జస్టిస్‌లు దీపక్ గుప్తా, సంజయ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం కేసును ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేసింది. కాగా అంతకుముందు సీబీఐ తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ పశ్చిమబెంగాల్‌లో అన్యాయం, అరాచకం రాజ్యమేలుతోందని ఆరోపించారు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన నేత భార్య లగేజిని తనిఖీ చేయడానికి ప్రయత్నించిన కస్టమ్స్ అధికారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించడమే ఇందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యం అంతా సీసీ టీవీలో సైతం రికార్డు అయ్యిందన్నారు. కాగా, శారదా కుంభకోణం కేసుతో సంబంధం ఉన్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌పై స్టేటస్ రిపోర్టును తాము సమర్పించినట్టు తెలిపారు. కాగా, సీబీఐ సమర్పించిన స్టేటస్ రిపోర్టులో రాజీవ్‌కుమార్ ఇంటరాగేషన్‌కు సంబంధించిన అంశాలు తీవ్రమైనవిగా తాము భావిస్తున్నట్టు ఈనెల 26న పేర్కొన్న సుప్రీం కోర్టు తాము ఇలాంటి వాటిపై కళ్లుమూసుకుని ఉండలేమని వ్యాఖ్యానించింది.
ఇందులో చాలా తీవ్రమైన అంశాలు వెల్లడవుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంవరకు కేసు దర్యాప్తును చేపట్టి, సిట్‌కు నేతృత్వం వహించిన కుమార్‌పై తగిన ఆధారాలతో మరో పత్రం దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. అలాగే పశ్చిమబెంగాల్ డీజీపీ, చీఫ్ సెక్రటరీ, కుమార్‌లపై ఉన్న ధిక్కారణ చర్యలను ఉపసంహరించుకోవడానికి కోర్టు నిరాకరించింది. కాగా, శారదా కుంభకోణం కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం, కేసుకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను ప్రశ్నించడానికి ఫిబ్రవరి 8న వెళ్లగా, రాష్ట్ర పోలీసులు సీబీఐ బృందాన్ని నిర్బంధించారు. తర్వాత దానిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేయడం, ఆ అంశం సుప్రీం కోర్టుకు వెళ్లడం తదితర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పశ్చిమబెంగాల్ అధికారులపై ధిక్కరణ పిటిషన్‌ను సైతం వేయగా, దానిపై సుప్రీంలో విచారణ సాగుతోంది.