క్రైమ్/లీగల్

ఇసుక లారీ ఢీకొని రైతు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎల్లారెడ్డిపేట, మార్చి 23: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ బస్టాండు ప్రాంతంలో కామారెడ్డి, కరీంనగర్ ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనాన్ని శుక్రవారం ఇసుక లారీ ఢీకొంది. ఈ సంఘటనలో పదిర గ్రామానికి చెందిన రైతు గోపన్నగారి లస్మయ్య(54) దుర్మరణం పాలయ్యాడు. అతని భార్య రేణుక తీవ్ర గాయాలకు గురైంది. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, గ్రామస్థుల కథనం మేరకు లస్మయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తుండేవాడు. తన భార్య రేణుక, కుమారుడు మహేందర్‌తో కలిసి ద్విచక్రవాహనంపై సిరిసిల్లకు వెళుతున్నారు. అటు నుంచి కామారెడ్డి వైపుకు వస్తున్న ఇసుక లారీ అతి వేగంగా ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. లస్మయ్య, రేణలకు తీవ్ర గాయాలయ్యాయి. మహేందర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మొదట సిరిసిల్లకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించే క్రమంలో లస్మయ్య చనిపోయాడు. రేణుక పరిస్థితి విషమంగా మారడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. విషయం తెలియడంతో గ్రామస్థులు, కుటుంబీకులు భారీ సంఖ్యలో సిరిసిల్లకు తరలివెళ్లారు. బంధువులు, కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. మృతుడికి ముగ్గురు కుమారులు మహేందర్, శేఖర్, ప్రభాకర్‌లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇసుక లారీల పట్టివేత
సిరిసిల్ల, మార్చి 23: సిరిసిల్ల మానేరు నుండి అక్రమంగా తరలి వెలుతున్న తొమ్మిది ఇసుక లారీలను మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. శుక్రవారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇసుకను తీసకవెలుతున్నట్టు తప్పుడు బోర్డులు పెట్టి, ప్రభుత్వ పనులకు వీటిని వినియోంచే బోర్డులు తగిలించుకుని అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలను అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల చెక్‌పోస్టు పోలీసులకు లారీలను అప్పగించారు. సిరిసిల్ల మానేరు నుండి రోజు వందలాది లారీలలో ఇసుకను తరలిస్తూండగా ఇందులో ప్రభుత్వ వేబిల్లులతో కొన్ని వెలుతుండగా, మిగితా సగం ఇలా తప్పుడు మార్గాలతో ప్రభుత్వాన్ని మోసగిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. ఒకే వేబిల్లుతో పలు సార్లు ఇసుకను తరలించడం, అలాగే ప్రభుత్వ పనుల పేరుతో తప్పుడు బోర్డులు పెట్టుకుని తరలించడం, ఇందు కోసం వేగంగా వెలుతూ ప్రమాదాలకు గురి చేస్తూ పలువురి ప్రాణాలను హరిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఒకేసారి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న తొమ్మిది లారీలను పట్టుకోవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది.