క్రైమ్/లీగల్

లాలూకు మళ్లీ జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, మార్చి 24: దాణా కుంభకోణం కేసుల్లో వరుస శిక్షలతో ఆర్జేడీ సుప్రీం లాలూప్రసాద్ యాదవ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా దాణా కుంభకోణం నాల్గవ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయనకు 14ఏళ్ల జైలు శిక్ష విధించింది. రూ.60 లక్షల అపరాధ రుసుము చెల్లించాలని ఆదేశించింది. 1990ల్లో దుమ్కా ట్రెజరీ నుంచి 3.13 కోట్లు కైంకర్యం చేశారన్న అభియోగాలను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శివ్‌పాల్ సింగ్ ఈమేరకు తీర్పునిచ్చారు. దుమ్కా ట్రెజరీ నుంచి నిధులు కైంకర్యం చేసిన కేసులో నేర శిక్షా స్మృతికింద ఏడేళ్లు, అవినీతి నిరోధక చట్టం కింద ఏడేళ్లపాటు
శిక్షలను న్యాయమూర్తి ప్రకటించారని సీబీఐ ప్రతినిధి రాకేష్ ప్రసాద్ వెల్లడించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నట్టు చెప్పారు. న్యాయవాది విష్ణుశర్మ కోర్టు తీర్పును వివరిస్తూ ‘ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌పై 420 (మోసం), 409 (ప్రజాప్రతినిధిగా నమ్మకాన్ని దుర్వినియోగం చేయడం), 467 (విలువైన పత్రాల పోర్జరీ), 468 (చీటింగ్ చేసే ఉద్దేశంతో పోర్జరీకి పాల్పడటం), 471, 477, 120బి సెక్షన్ల కింద ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించటంతోపాటు 30 లక్షల రూపాయల అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందన్నారు. అలాగే, అవినీతి నిరోధక చట్టం కింద మరో ఏడేళ్ల జైలుతోపాటు, మరో 30 లక్షల రూపాయల అపరాధ రుసుము చెల్లించాలని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు నిచ్చినట్టు విష్ణుశర్మ వివరించారు. అయితే, ఒకే కేసులో రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయని వివరించారు. ఒకవేళ అపరాధ రుసుము చెల్లించలేని పక్షంలో ఒక్కో శిక్షా విభాగంలో ఒక్కో ఏడాది చొప్పున రెండు విభాగాల్లో రెండేళ్ల జైలును ఏకకాలంలో అనుభవించాల్సి ఉంటుందని వివరించారు. ఇదే కేసులో మరో 18మందిని నేరస్తులుగా నిర్దారిస్తూ ప్రత్యేక కోర్టు శిక్షలను ప్రకటించింది. లాలూకు విధించినట్టే పశుసంవర్థక శాఖ రిటైర్డ్ రీజినల్ డైరెక్టర్ ఓపీ దివాకర్‌కూ శిక్షలను ఖరారు చేసింది. అలాగే, ఈ కుంణకోణంతో సంబంధం ఉన్నట్టు నిర్థారిస్తూ పశు సంవర్థక శాఖలోని 9మంది అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారి పూల్‌చంద్ సింగ్‌లకు ఏడేళ్ల జైలుతోపాటు 30 లక్షల రూపయల అపరాధ రుసులు విధించింది. వీరిలో ఎవరైనా అపరాధ రుసులు చెల్లించని పక్షంలో మరో పద్దెనిమిది నెలల జైలు అదనంగా అనుభవించాల్సి ఉంటుందని శర్మ వెల్లడించారు. దాణా సరఫరాదారుల్లో ఏడుగురికి మూడున్నరేళ్ల జైలు, 15లక్షల అపరాధ రుసుము విధించింది. శిక్షలు ప్రకటించిన తరువాత లాలూ తరఫు న్యాయవాది ప్రభాత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును పై కోర్టుల్లో సవాల్ చేయనున్నట్టు వెల్లడించారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా, మరో 12మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చడం తెలిసిందే. ఇదిలావుంటే, దాణా కుంభకోణం రెండో కేసు తరువాత (గత ఏడాది డిసెంబర్ 23) నుంచీ ఆర్జేడీ చీఫ్ లాలూప్రసాద్ రాంచీలోని బిర్సాముండా జైల్లో శిక్ష అనుభవిస్తోన్న విషయం తెలిసిందే. దోగర్ ట్రెజరీ నుంచి అక్రమంగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న అభియోగాలు నిర్థారణ కావడంతో, లాలూను అరెస్ట్ చేసి జైలుకు తరలించటం తెలిసిందే.