క్రైమ్/లీగల్

పన్ను వసూలుకెళ్తే నిర్బంధించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/జీడిమెట్ల, మార్చి 24: జీడిమెట్లలోని ఓ పరిశ్రమలో పన్నులను వసూలు చే సేందుకు వెళ్లిన కుత్బుల్లాపూర్ సర్కిల్ అధికారులను పరిశ్రమ యాజమాని నిర్బంధించిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పారిశ్రామి క వాడలోని వెంకటరత్న మెటల్స్ ప్రైవేటు లిమిటెడ్, రత్న ఎక్స్‌ట్రూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ ప రిశ్రమ ఆస్తి పన్ను రూ. 5.38 లక్షల బకాయి పడింది. పన్ను వసూలు చేసేందుకు సర్కిల్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బందితో క లిసి పరిశ్రమకు వెళ్లారు. పరిశ్రమ యాజమాని అమ్మిరాజు అధికారులతో నిర్లక్ష్యంగా మాట్లాడుతూ దుర్భాషలాడాడు. అక్కడితో ఆగకుం డా అధికారులపై చేయిచేసుకుని, సెక్యూరిటీ గార్డ్‌తో కలిసి నిర్బంధించాడు. గేటు లోపల ఉ న్న అధికారులు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉపకమిషనర్ సుదాంశ్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఉప కమిషనర్ పరిశ్రమను సీజ్ చేశారు. ట్యాక్స్ ఇ న్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసు లు పరిశ్రమ యజమాని అమ్మిరాజు, సిబ్బంది శివప్రసాద్‌రావు, వెంకటరమణ మూర్తి, రఫీక్‌ల పై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
చిత్రం..జీడిమెట్లలో పరిశ్రమను సీజ్ చేస్తున్న ఉపకమిషనర్ సుదాంశ్