క్రైమ్/లీగల్

ఆ రెండు కోట్లూ జయభేరివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి, ఏప్రిల్ 4: హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో మాదాపూర్ పోలీసులు పట్టుకున్న రెండు కోట్ల రూపాయల నగదు జయభేరి ప్రాపర్టీస్ సంస్థకు చెందినదేనని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. సైబరాబాద్ కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రెండు కోట్ల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన నిమ్మాలూరి శ్రీహరి (44), సంగారెడ్డి రేగొడు మండల సిండొలేకు చెందిన అరుతి పండరిలు గచ్చిబౌలిలోని జయభేరి ప్రాపర్టీస్ సంస్థలో పని చేస్తున్నారు. బుధవారం సాయంత్రం గచ్చిబౌలిలోని సంస్థ కార్యాలయం నుంచి రెండు కోట్ల రూపాయలను బ్యాగులో తీసుకొని రాజమండ్రికి వెళ్తున్నారు. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వద్ద ఎస్‌ఓటీ బృందాలతో పాటు స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడ్డారు. ఇద్దరు వ్యక్తుల వద్ద ఉన్న బ్యాగులను పరిశీలించగా అందులో రెండు వేలు, 500 రూపాయల నోట్ల కట్టలు ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని మాదాపూర్ పోలీసులకు అప్పగించారు. శ్రీహరిని పండరీలను మాదాపూర్ పోలీసులు విచారించగా డబ్బును రాజమండ్రికి తీసుకుని వెళ్తున్నట్లు అంగికరించారు. రాజమండ్రిలో తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి తరఫున పంపిణీ చేయాడానికి నగదు తీసుకెళ్తున్నట్టు తెలిపారు. జయభేరి సంస్థలో పనిచేస్తున్న ధర్మరాజు, జగన్మోహన్ రావు రాజమండ్రి తీసుకెళ్లి అక్కడ యలమంచిలి మురళీ కృష్ణకు అప్పగించమని ఆదేశించినట్లు నిందితులు వెల్లడించారు. సికింద్రాబాద్‌లో గరీబ్థ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి రాజమండ్రి చేరుకుంటే అక్కడ మురళికృష్ణ కారులో ఎదురు చూస్తుంటాడని విచారణలో వారు తెలిపారు. రెండు కోట్ల రూపాయలను ఎంపీ మురళీమోహన్‌కు అందచేయాలని ధర్మరాజు, జగన్మోహన్ చెప్పినట్లు పోలీసులకు నిందితులు వివరించినట్లు సీపీ చెప్పారు. విచారణకు హాజరు కావాలని మురళీ మోహన్‌కు, యలమంచిలి మురళి కృష్ణకు నోటీసులు ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. సైబరాబాద్ చెక్ పోస్టులు పెట్టి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఇప్పటి వరకు రెండు కోట్ల 75 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. ఈకార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, ఎస్‌ఓటీ ఏడీసీపీ దయానంద్ రెడ్డి, మాదాపూర్ ఏసీపీ శ్యామ్ ప్రసాద్ రావు, ఎస్‌ఓటీ సీఐ పురుశోత్తం, మాదాపూర్ సీఐ నాగేశ్వరరావుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రెండు కోట్ల రూపాయలను పట్టుకున్న మాదాపూర్ పోలీసులను ఎస్‌ఓటీ బృందాలను సీపీ అభినందించారు.
చిత్రాలు.. పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బులను పరిశీలిస్తున్న సీపీ ఇతర అధికారులు,
*నగదు తరలిస్తూ పోలీసులకు చిక్కిన శ్రీహరి, పండరీ (ఇన్‌సెట్‌లో)