క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజేంద్రనగర్, ఏప్రిల్ 4: లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ పంచాయతీ సెక్రటరీ పట్టుబడ్డాడు. సంఘటన రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విజయా బ్యాంక్ వద్ద చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం గండిపేట మండల పరిధిలోని పుప్పాలగూడ గ్రామ పంచాయ తీ కార్యదర్శి వెంకట శివయ్య. మణికొండ గ్రామ పంచాయతీకి ఇన్‌చార్జి కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నా డు. పుప్పాలగూడలో అలీ అనే వ్యక్తి ఇంటిని నిర్మిస్తున్నాడు. ఈనెల 13న పంచాయతీల గడువు ముగుస్తుండడంతో అనుమతుల కోసం వెంకట శివయ్యను అలీ ఆశ్రయించాడు. రూ.5 లక్షలను లంచంగా డిమాండ్ చేశా డు. రూ.3 లక్షల నగదును ముందుగానే అందజేశాడు. మిగిలిన డబ్బులను గురువారం ఇస్తానని తెలిపాడు. గురువారం రాజేంద్రనగర్‌లో ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని విజయా బ్యాంక్ వద్ద డబ్బులు ఇస్తానని వెంకట శివయ్యకు తెలిపాడు. ఏసీబీ అధికారులను ఆశ్రయించి విషయం తెలిపాడు. కాగా గురువారం డబ్బులు తీసుకోవడానికి వచ్చిన వెంకట శివయ్యను ఏసీబీ అధికారులు మాటు వేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.