క్రైమ్/లీగల్

రెండిళ్లలో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఏప్రిల్ 4: వేర్వేరు సంఘటనలో ఇంటి తాళాలు పగులగొట్టి నగలు, నగదును చోరీ చేసిన సంఘటన ఘట్‌కేసర్ పోలీసు స్టేషన్ పరిధి చౌదరిగూడ, యంనంపేట్ గ్రామాలలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... చౌదరిగూడ పంచాయతీ సాయిబాబానగర్‌లో నివాసం ఉంటున్న కొత్తపల్లి రాజు గత నెల 29న తన మరదలు వివాహం ఉండటంతో కేసవముద్రం వెళ్లినట్లు తెలిపారు.
తిరిగి మంగళావారం రాత్రి చేరుకోగా ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లోని బంగారు గొలుసు, చెవి రింగులు, 20 వేల నగదు, ఆరు తులాల వెండి గొలుసులు చోరీ అయినట్లు తెలిపారు. మరో సంఘటనలో యంనంపేట్ గ్రామంలో నివాసం ఉంటున్న కొమ్మ బక్కయ్య తన కొడలుకు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో ఉండటంతో ఆమెకు సంబంధించిన రెండున్నర తులాల బంగారు గొలుసు, ఐదు తులాల వెండి పట్టగొలుసులు, రూ.2500 నగదును ఇంట్లో బిరవాలో పెట్టి నిద్రించగా దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బిరువా తాళాలు పగులగొట్టి నగలు, నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.