క్రైమ్/లీగల్

రైళ్లలో చోరి చేసే ఘరానా దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఏప్రిల్ 5: గత 20 ఏళ్లుగా రైళ్లలో నేరాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్తుణ్ని నెల్లూరు ప్రభుత్వ రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో గుంతకల్లు రైల్వే ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ వెల్లడించిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన మేనపాటి శ్రీనివాసన్ అలియాస్ చెన్నై శీను ప్రస్తుతం విజయవాడంలో నివాసం ఉంటున్నాడు. ఇంటర్ తర్వాత చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు.
తరచూ ఊళ్లు మారుతూ రైళ్లలో చోరీలు చేయడం ప్రారంభించాడు. ఇతనికి భార్య ఇద్దరు కుమారులు. తనకున్న పరిచయాలతో సాధారణ టిక్కెట్ తీసుకొని ఏసీ బోగీల్లో ప్రయాణం చేస్తూ రాత్రి పూట నిద్రిస్తున్న మహిళల మెడలోని బంగారు ఆభరణాలను లాక్కొని పరారయ్యేవాడు. ఇతని కోసం గత నాలుగేళ్లుగా గుంతకల్లు రైల్వే డివిజన్ పోలీసులు గాలిస్తున్నారు.
ఈ క్రమంలో నెల్లూరులో రైలులో ప్రయాణిస్తుండగా గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాను మొత్తం 15 చోరీలకు పాల్పడినట్లు నిందితుడు వెల్లడించారు. అతని వద్ద నుండి రూ.33లక్షల పైబడి విలువ కలిగిన 1.1కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసులో ప్రతిభ కనబరిచిన నెల్లూరు రైల్వే డి ఎస్పీ వసంతకుమార్, నెల్లూరు, ఒంగోలు రైల్వే సి ఐలు దశరథరామారావు, మంగారావు వారి సిబ్బందిని ఎస్పీ అభినందించి రివార్డులు అందచేశారు.

చిత్రం..స్వాధీనం చేసుకున్న నగలు, నిందితుడితో గుంతకల్లు రైల్వే ఎస్పీ, ఇతర సిబ్బంది