క్రైమ్/లీగల్

హైకోర్టును ఆశ్రయించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఇటీవల జారీ అయిన ఆధార్ ఆర్డినెన్స్ రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన పిటిషనర్లను హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీరి అప్పీళ్లను విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోనే తమ అభ్యంతరాలను వెల్లడించాలని కోరింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఏ.బాబ్డే, ఎస్.ఏ.నజీర్‌లతో కూడిన సుప్రీం బెంచ్ ‘ఈ కేసు చెల్లుబాటుపై మేము ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. దీనిపై హైకోర్టు అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు. ఈ కేసులో పిటిషనర్ల తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి మాట్లాడుతూ ఇది జాతీయ ప్రాధాన్యత కలిగిన అంశమని, దీనిపై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు జాతీయ ప్రధాన్యతను కలిగి ఉంటుందని స్పష్టం చేశారు.
దీని దృష్ట్యా హైకోర్టు ఈ అంశాన్ని తేల్చాలని డిమాండ్ చేశారు. దానికి స్పందించిన న్యాయమూర్తులు ‘ఈ అంశాన్ని విచారించే అధికారం మాకు లేదని మేము చెప్పడంలేదు’ అని వివరించారు. కాగా, హైకోర్టును ఆశ్రయించే ఉద్దేశ్యంతో ఈ పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నామని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అందుకు కోర్టు అనుమతించింది. దాంతో ఈ పిటిషన్లను ఉపసంహరించుకుంటున్నట్టుగా కొట్టివేస్తున్నట్టు సుప్రీంకోర్టు బెంచ్ తెలిపింది.