క్రైమ్/లీగల్

ప్రమాదవశాత్తు మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాడికి, మార్చి 25 : మండల పరిధిలోని రాయలచెరువు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు నీటి కొళాయి గుంతలో పడి హేమలత (50) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు హేమలత యాడికి ఉన్నత పాఠశాలలో ల్యాబ్ సహాయకురాలిగా పని చేస్తోంది. ఈనేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున పాలు తీసుకురావడం కోసం బయటకు వచ్చి ప్రమాదవశాత్తు కొళాయి గుంతలో పడి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి కుమారుడు, కూతురు ఉన్నట్లు బంధువులు తెలిపారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బెళుగుప్ప, మార్చి 25 : బెళుగుప్ప సమీపంలోని పూలవంక వద్ద ఈనెల 18న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సురేష్ (32) చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన రోజే గోపాల్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన నక్కలపల్లి గ్రామానికి చెందిన సురేష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు వెంకటస్వామి, తిమ్మక్క, భార్య సుజాత బోరున విలపించారు.

అతిగా మద్యం తాగి మహిళ మృతి
గోరంట్ల, మార్చి 25 : మండల పరిధిలోని గొల్లపల్లిలో అతిగా మద్యం సేవించి అశ్వర్థమ్మ (52) మృతి చెందినట్లు ఎస్సై సుధాకర్ యాదవ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అశ్వర్థమ్మ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం రాత్రి తాగిన మత్తులో అశ్వర్థమ్మ తన అల్లుడు ఆంజనేయులు ఘర్షణ పడ్డారని, ఈ సమయంలో అల్లుడు ఆంజనేయులు ఆమెను తీవ్రంగా కొట్టాడని, ఇది జరిగిన కొంత సేపటికే మృతి చెందినట్లు తెలుస్తోంది.