క్రైమ్/లీగల్

రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 5: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ శుక్రవారం నాడు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీబీ రాధాకృష్ణన్ కొల్‌కటా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ కావడంతో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో జస్టిస్ చౌహాన్ లాంఛనంగా కుటుంబ సభ్యులతో గవర్నర్‌ను కలిశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు చౌహాన్ వారి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. 1980లో అమెరికాలో గ్రాడ్యూయేషన్ మొదలు, రాజస్థాన్ బార్ కౌన్సిల్‌లో ప్రాక్టీస్ అనంతరం న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం, కర్నాటక హైకోర్టు అనుభవాలను , 2018 నవంబర్ 23న తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వచ్చిన విశేషాలను జస్టిస్ చౌహాన్ పంచుకున్నారు.