క్రైమ్/లీగల్

బస్సును ఢీకొన్న కంటెయనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, ఏప్రిల్ 5: మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని ముస్లాపూర్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటెయనర్ బస్సును ఢీకొనడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కంగ్టి మండలంలోని నాగర్‌గిద్ద మండలం కేశ్‌వార్ గ్రామానికి చెందిన మైనార్టీ సోదరులు హైదరాబాద్‌లో ఓ వివాహ వేడుకకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో ముస్లాపూర్ గ్రామ శివారులోని రహదారిపై బస్సును ఎదురుగా వస్తున్న కంటెయనర్ వేగంగా వచ్చి ఢీకొనడంతో బస్సు ధ్వంసమై 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున బస్సులో ప్రయాణిస్తూ నిద్రిస్తున్న పెళ్లివారు కండేనర్ ఢీకొనడంతో కొందరికి కాళ్లు, చేతులు విరిగి రక్తస్రావం జరిగింది. బస్సులో ఇరుకున్న వారిని స్థానిక పోలీసులు బయటకు తీసి వారి ప్రణాలను కాపాడారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనం ద్వారా జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కంటేనర్ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. కానీ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు ఆసుపత్రి వద్దకు వచ్చి విలపించారు. కంటెయనర్ డ్రైవర్‌పై అల్లాదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు బస్సు డ్రైవర్ తెలిపారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి వెళ్లి రక్తంమడుగులో ఉన్న ప్రయాణికులను 108 వాహనంలో జోగిపేట ఆసుపత్రికి తరలించారు. అల్లాదుర్గం ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.