క్రైమ్/లీగల్

వంచనతో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 6: దాచుకున్న డబ్బులు ఇవ్వనందుకు ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించి విషం సేవించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట డివిజన్ బీరప్పనగర్‌లో నివాసముండే చితనూర్ మల్లికార్జున్ (26) స్క్రాప్ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి భార్య నాగరాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మల్లికార్జున్ గాంధీనగర్‌కు చెందిన గడ్డం నర్సింహ వద్ద రూ.15 లక్షలు ఎవరికి తెలియకుండా దాచిపెట్టాడు. అదేవిధంగా నాగరాజు అనే వ్యక్తికి రూ.2 లక్షలు ఇచ్చినట్లు వీడియోలో వెల్లడించారు. అప్పులు ఎక్కువైన మల్లికార్జున్ నర్సింహను, నాగరాజును దాచుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా డబ్బులు ఇచ్చినట్లు ఏం సాక్ష్యం ఉందని తాను ఏమీ ఇవ్వనని నర్సింహ చెప్పడంతో పాటు బెదిరించడంతో మనస్థాపానికి గురైన మల్లిఖార్జున్ మార్చి 27న విషం సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మృతుడు సూసైడ్ చేసుకునే ముందు గడ్డం నర్సింహ, నాగరాజు అనే వ్యక్తుల వద్ద దాచిన డబ్బులు ఇవ్వనందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించాడు. ఈ మేరకు మృతుని భార్య నాగరాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పది రోజుల అనంతరం వెలుగులోకి రావడం విశేషం.