క్రైమ్/లీగల్

గుప్తా బెయిల్ పిటిషన్‌పై వైఖరి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణంలో అరెస్టయిన డిఫెన్స్ ఏజెంట్ సుశేన్ మోహన్ గుప్తా పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై స్పందనను తెలియజేయాల్సిందిగా ఢిల్లీలోని ఓ కోర్టు శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశించింది. రూ. 3,600 కోట్ల విలువ గల వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసులో ఈడీ సుశేన్ మోహన్ గుప్తాను అరెస్టు చేసింది. గుప్తా ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి అరవింద్ కుమార్‌కు తన బెయిల్ పిటిషన్‌ను సమర్పించారు. ఏప్రిల్ 9వ తేదీలోగా ఈ బెయిల్ పిటిషన్‌పై స్పందనను తెలియజేయాలని అరవింద్ కుమార్ ఈడీని ఆదేశించారు. ఈడీ మరో రెండు రోజులు గుప్తాను తన కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్ చేయడానికి కూడా న్యాయమూర్తి అనుమతించారు. అంతకు ముందు గుప్తాను తన కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును అభ్యర్థించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ గుప్తాను అరెస్టు చేసింది.