క్రైమ్/లీగల్

ఎన్నికల సమయంలో రూ.48 కోట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 6: తెలంగాణ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 48,14,43,846 రూపాయల నగదు, ఇతర వస్తువులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటి నుండి పోలీసు శాఖ, ఎక్సైజ్ శాఖ ఇతర శాఖలు రోడ్లపై తనిఖీలు చేయడం ప్రారంభించాయి. అక్రమంగా ఎక్కడైనా, ఎవరైనా నగదు, ఇతరత్రా వస్తువులు దాచి ఉన్నట్టు సమాచారం అందితే మెరుపుదాడులు చేస్తున్నారు. ఇప్పటి వరకు పోలీసు శాఖ 23.54 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా, ఆదాయపన్ను శాఖ 17.50 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పోలీసు శాఖ చేసిన తనిఖీల్లో 82 లక్షల రూపాయల విలువ చేసే మద్యం స్వాధీనం చేసుకోగా, ఎక్సైజ్ శాఖ 3.02 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంటే మొత్తం 3.85 కోట్ల రూపాయల విలువ చేసే మద్యాన్ని ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఉండగా 2.75 కోట్ల రూపాయల విలువైన కొకైన్, హీరాయిన్, కెమికల్ పౌడర్, గాంజా, గుట్కా మసాలా, స్వాధీనం చేసుకున్నారని ఎన్నికల కమిషన్ శనివారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.