క్రైమ్/లీగల్

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడ్‌మెట్, ఏప్రిల్ 7: మాయమాటలు చెప్పి యువతిని మోసం చేసిన వ్యక్తిని బాధితురాలి ఫిర్యాదు మేరకు అరెస్టు చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ముషిరాబాద్ రామ్‌నగర్‌లో నివసించే సాయితేజ అలియాస్ సన్ని(27), ప్రైవేట్ ఉద్యోగి. మల్కాజిగిరి పీవీఎన్ కాలనీలో నివసించే అతని చెల్లెలి క్లాస్‌మెట్ యువతి(23)తో కొంత కాలం క్రితం పరిచయం పెంచుకున్నాడు. పరిచయం ఏర్పడిన తర్వాత ఆమెకు తెలియకుండా సెల్‌ఫోన్‌లోని ఫొటోలు తీసుకుని మార్ఫింగ్ చేసి, అత్యాచార యత్నానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. సాయితేజ వేధింపులు భరించలేనని గత నెల 23వ తేదిన మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆదివారం సాయితేజని అరెస్టు చేసినట్టు తెలిపారు.