క్రైమ్/లీగల్

మీ విధానం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలు తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈబీసీని అమలుచేయడానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో రిజర్వేషన్ల అమలుపై మరీ ముఖ్యంగా నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా జరిగే ఎంబీబీఎస్, బీడీఎస్‌ల అడ్మిషన్లకు సంబంధించి ఎలాంటి పద్ధతిని అనుసరించబోతున్నారో తేల్చి చెప్పాలని సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఓబీసీ, ఈబీసీలపై విస్తృత చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అడ్మిషన్లకు నీట్‌ను నిర్వహిస్తున్నారు. నీట్ ర్యాంకు ద్వారా ఆయా రాష్ట్రాల్లోని మెడికల్ , డెంటల్ కోర్సుల్లోని 85 శాతం సీట్లను స్థానిక మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తుండగా మరో 15 శాతం సీట్లను జాతీయ పూల్ ద్వారా భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ కోటాలో 85 శాతం సీట్లకు స్థానిక విధానాలను అవలంభించినా, 15 శాతం జాతీయ పూల్ కోటాలో జాతీయ స్థాయిలో అనుసరిస్తున్న రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంపై ఇరు తెలుగు రాష్ట్రాలూ స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడంతో గతంలో జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా వ్యవహరించిన ప్రస్తుత ఆల్ ఇండియా వెనుకబడిన తరగతుల ఫెడరేషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ ఓబీసీ అమలుపై తమ వివరణ ఇవ్వాలని ఇరు తెలుగు రాష్ట్రాలను ఆదేశించారు. స్థానిక కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగుల కోటా, క్రీడాకారుల కోటా, ఎన్‌సీసీ, మాజీ సైనికుల కోటాలను అమలుచేస్తున్నా, జాతీయ పూల్ ద్వారా ఓబీసీ కోటాను మాత్రం పాటించడం లేదని పిటీషనర్ వాదించారు.