క్రైమ్/లీగల్

బస్సును ఢీకొన్న లారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లాదుర్గం, ఏప్రిల్ 7: మెదక్ జిల్లా అల్లాదుర్గం పోలీస్ స్టేషన్ సమీపంలోని 161 జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం బస్సును లారీ ఢీకొన్న సంఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న కండక్టర్, డ్రైవర్‌తో సహా 20 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఆరుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వెళ్లి తిరుగు ప్రయాణంలో అల్లాదుర్గం హైవే రోడ్డుపై వెళ్తుండగా ఎంహెచ్ 30 ఎబి 3232 అనే లారీ బెంగుళూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఢీకొనడంతో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. ఇందులో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. మల్కాపూర్ గ్రామానికి చెందిన మోహన్, మరో చిన్న పిల్లవాడు, డ్రైవర్ జలేందర్, కూరగాయలు అమ్ముకునే రత్నమ్మ, కండక్టర్ శివశంకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ ఢీకొనగానే శబ్దం రావడంతో బస్సులోని ప్రయాణికులు భయపడిపోయారు. కళ్లు మూసి తెరిచేలోగానే బస్సు ఒక భాగం పూర్తిగా ధ్వంసమైంది. వెంటనే 108కు సమాచారం అందించగా అల్లాదుర్గం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు కండక్టర్ శివశంకర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. లారీ డ్రైవర్ అతి వేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఫిర్యాదులో తెలిపారు. లారీ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయగా ఎస్సై గౌస్ పాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
చిత్రాలు.. బస్సును ఢీకొన్న లారీ.. క్షతగాత్రులైన ప్రయాణికులు