క్రైమ్/లీగల్

రెండువర్గాల మధ్య ఘర్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారాయణపేట టౌన్, మార్చి 25: నారాయణపేట మండలం అభంగాపూర్ గ్రామంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా రెండు వర్గాలకు చెందిన 40మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో 14మందిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపేట మండలం అభంగాపూర్ గ్రామంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి ఆధ్వర్యంలో ఆదివారం భగత్‌సింగ్, సుఖదేవ్, రాజగురు వర్దంతి వేడుకలను నిర్వహించే ఏర్పాట్లు చేసుకుని ముందుగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంజనేయస్వామి దేవాలయం వద్ద ఉన్న తమ పార్టీ జెండా కట్ట వద్ద నివాళులు అర్పించే ఏర్పాట్లు చేయగా శ్రీ రామ నవమిని పురస్కరించుకుని గ్రామస్థులు మైక్‌సెట్‌ను ఏర్పాటు చేశారు. అయితే తమ చిన్న కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని వెళతామని సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి నాయకులు అంజనేయస్వామి దేవాలయం వద్ద ఉన్న వారిని సంప్రదించగా అందరూ కలసి గ్రామ పెద్దలను సంప్రదించారు. అయితే కాసేపు మైక్ సౌండ్‌ను తగ్గించాలని గ్రామస్థులు చెప్పినా కొందరు యువకులు జోక్యం చేసుకుని అంజనేయస్వామి దేవాలయం వద్ద మైక్ సౌండ్‌ను పెంచడంతో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి, గ్రామంలోని బిజెవైఎం నాయకుల మధ్య చిన్నపాటి గొడవ ప్రారంభమైంది. అయితే గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసే ప్రయత్నాలు చేస్తుండగానే ఒక వర్గం వారు కర్రలతో దాడులకు దిగడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. ఏకంగా ఇరు వర్గాలకు చెందిన వారు కర్రలతో దాడులకు పాల్పడటంతో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ సమాచారం అందుకున్న డిఎస్పీ శ్రీ్ధర్ గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి ఇరు వర్గాల పిర్యాదు మెరకు మొత్తం 40మందిపై కేసులు నమోదు చేశారు. అందులో 14మందిని ఆదివారం రాత్రి రిమాండ్‌కు తరలించి మిగిలిన వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు.