క్రైమ్/లీగల్

సాయిశ్రీ మృతి ఉదంతంలో శివ, మరికొందరిపై కేసు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: సుమశ్రీ మృతి కేసు మళ్లీ తెర పైకి వచ్చింది. మాజీ భర్త మాదంశెట్టి శివకుమార్ తనకు అన్యాయం చేయడంతో పాటు కుమార్తె సాయిశ్రీ మరణానికి కారకుడయ్యాడని, ఈ వ్యవహారంలో సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రమేయం ఉందని ముందునుంచీ ఆరోపిస్తూ వస్తున్న సుమశ్రీ తాజాగా హైకోర్టును ఆశ్రయించటంతో అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సూర్యారావుపేట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. గత ఏడాది సుమశ్రీ ఉదంతం రాష్టవ్య్రాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. కృష్ణలంకకు చెందిన మాదంశెట్టి శివకుమార్, సుమశ్రీ పూర్వాశ్రమంలో భార్యభర్తలు కాగా, చిన్నారి సాయిశ్రీ జన్మించింది. కొంతకాలానికి వీరిద్దరూ విడిపోయి దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం సుమశ్రీ భర్త పోలినేని కృష్ణకుమార్‌తో కలిసి జీవిస్తోంది. అయితే సాయిశ్రీకి గతంలో శివకుమార్ దుర్గాపురంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. అందులోనే నివాసముంటున్న సుమశ్రీ కుమార్తె సాయిశ్రీ గత ఏడాది తీవ్ర అనారోగ్యంతో మరణించింది. అయితే తనను ఇంటి నుంచి గెంటివేసి అన్యాయం చేశారంటూ శివకుమార్‌పై అప్పట్లో సూర్యారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకు ఎమ్మెల్యే బొండా ఉమా, ఆయన అనుచరులు సహకరించారని ఆరోపించటంతో ఈ ఉదంతం సంచలనం రేపింది. అయితే పోలీసులు తన ఫిర్యాదుపై చర్యలు తీసుకోలేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం సుమశ్రీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులతో సుమశ్రీ తన న్యాయవాదితో సూర్యారావుపేట పోలీసులను సంప్రదించింది. మరోవైపు ఆమె కమిషనరేట్‌కు వచ్చి సెంట్రల్ కంప్లైంట్ సెల్ (సీసీసీ)లో ఫిర్యాదు చేసింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న సూర్యారావుపేట పోలీసులు మాదంశెట్టి శివకుమార్, మరికొందరిపై వివిధ సెక్షన్ల కింద శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.